మాస్ మహారాజా రవితేజ త్వరలో మెగా ఫోన్ పట్టనున్నారు. కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన రవితేజ తెలుగుతో పాటు బాలీవుడ్,టవీ సీరియల్స్‌కు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు. అయితే ఎవరు ఉహించనవి విధంగా రవితేజ జీవితాన్ని మార్చేశారు కృష్ణవంశీ. సింధూరం సినిమాలో నటుడిగా అవకాశం ఇచ్చి రవితేజకు మంచి బ్రేక్ ఇచ్చారు. అప్పటివరకు వెండితెరకు క్లాప్ కొట్టిన రవితేజ తర్వాత మేకప్ వేసుకుని అశేష అభిమానులను సంపాదించుకున్నారు.
తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ మాస్ మహారాజాగా ముందుకుసాగుతున్నాడు. అయితే ఓ వైపు హీరోగా కొనసాగిస్తూనే మరోవైపు దర్శకత్వ బాధ్యతను భుజాన వేసుకునేందుకు సిద్దమయ్యారట. ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్‌ని కలిసిన రవితేజ ఓ ఇంట్రెస్టింగ్ కథని చెప్పాడట. ఈ కథ నందమూరి హీరోకి నచ్చడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట రవితేజ. గతంలో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో రవితేజ కిక్ 2 సినిమా చేయగా ఇప్పుడు రవితేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సినిమా చేస్తున్నారనే వార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ డిస్కో రాజా అనే చిత్రం చేస్తున్నాడు రవితేజ. ఈ చిత్రంతో పాటుగా తమిళ హిట్ ‘తేరి’కి రీమేక్‌గా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి కనకదుర్గ అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ అనుకుంటున్నారట. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి.