దీపావళి.. అభిమానులకు రవితేజ సర్ ప్రైజ్

373
disco raja
- Advertisement -

మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా మూవీ చేస్తున్నాడు. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, న‌బా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈమూవీపై రవితేజ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇటివలే రవితేజ నటించిన సినిమాలు ప్లాప్ గా నిలవడంతో ఈమూవీతో ఎలాగైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

కాగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక రేపు దీపావళి సందర్భంగా తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు రవితేజ. తన తర్వాతి చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను రేపు ప్రకటించనున్నారు. మ‌ధ్యాహ్నం 2గం.ల‌కి దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ర‌వితేజ రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీ త‌ర్వాత ర‌వితేజ చేసిన చిత్రాల‌న్ని ఫ్లాపులు కాగా, తాజా చిత్రం డిస్కోరాజాపై హోప్స్ పెట్టుకున్నాడు.

- Advertisement -