అందాల రాక్షసితో రవితేజ రొమాన్స్..

253
Raviteja
- Advertisement -

బెంగాల్ టైగర్ సినిమా తర్వాత ఏడాదిన్నర పాటు మరో సినిమా చేయని మాస్ రాజా రవితేజ తాజాగా ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. విక్రమ్‌ సిరికొండ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ..టచ్ చేసి చూడు అనే మాస్ ఎంటర్‌టైనర్‌ను ముస్తాబుచేయబోతున్నాడు. టైటిల్ రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం క్యారెక్టర్స్‌ ఎంపికలో బిజీగా ఉన్నాడంట దర్శకుడు. ఇందులో భాగంగానే హీరోయిన్‌ ను ఓకే చేసినట్టు తెలుస్తోంది. రవితేజ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నారట. అల్రెడీ ఒక లేడి పాత్రకు రాశీఖన్నా ఎంచుకోగా మరో పాత్రకు అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి అవకాశం దక్కిందట.

Raviteja

visit greattelangaana.com

‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్ర విజయాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది లావణ్య. వరుసగా యంగ్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీ గా ఉంటోంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ సరసన ‘మిస్టర్‌’ చిత్రంలో నటిస్తున్న లావణ్య.. రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ చిత్రంతో స్టార్ హీరోలకు గాలమేసేందుకు అవకాశం దక్కినట్టైంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికల పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందని యూనిట్‌ చెబుతోంది. చాలా రోజుల నుంచి ఫామ్ లేమితో సతమతమవుతున్న మాస్ రాజా ఈసినిమాతో మళ్లీ గాడిలో పడాలని చూస్తున్నాడట. అందుకే కాస్త లేటైన మంచి కథతో రాబోతున్నాడట.

- Advertisement -