వృద్ధుడిగా మారనున్న మాస్ మ‌హారాజా..

194
raviteja
- Advertisement -

టాలీవుడ్ హీరో మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానులు అలరించడానికి వస్తున్నాడు. డిఫ‌రెంట్ కాన్సెప‌ట్స్‌ని త‌న క‌థాంశాలుగా ఎంచుకుంటూ అటు విమ‌ర్శ‌కులు ఇటు ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ డైరెక్ష‌న్‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది.

ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఎన‌ర్జీకి స‌రిపోయే విధంగా ఈ సినిమాకు డిస్కో రాజా అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు.

Raviteja

ఈ మూవీ కథ ప్రారంభంలో రవితేజ వృద్ధుడిగా కనిపిస్తాడని సమాచారం. ఆ తరువాత తన శత్రువులపై పగ తీర్చుకోవడం కోసం యువకుడిగా మారిపోతాడట. వృద్ధుడిగా వున్న ఆయన యువకుడిగా ఎలా మారిపోతాడనేదే సస్పెన్స్. ఇలా ఒక కొత్త కాన్సెప్ట్‌తో వున్న కారణంగానే ఈ సినిమా చేయడానికి వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీగా ఈ కథ సాగుతుందని చెబుతున్నారు.

- Advertisement -