‘మిస్టర్ బచ్చన్’.. మాస్ & యాక్షన్-ప్యాక్డ్ షోరీల్

7
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి కిక్కాస్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ బచ్చన్’ కోసం కలిశారు. మాస్ మహారాజా, మాస్ మేకర్ మాస్ రీయూనియన్ మునుపెన్నడూ లేని ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. షోరీల్ వీడియోని రిలీజ్ చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.

ఈ షోరీల్‌లోని యూనిక్ నెస్ ఏమిటంటే ఇందులో ఎలాంటి డైలాగ్‌లు లేవు. షోరీల్ ని కంప్లీట్ యంగేజింగ్ గా కట్ చేశారు హరీష్ శంకర్. రవితేజ స్టైలిష్, మాస్ క్యారెక్టర్‌లో పరిచయం కాగా, జగపతి బాబు ఓల్డ్ ఫెరోషియస్ మ్యాన్ గా కనిపించారు. రవితేజ గెటప్ క్లాస్‌గా వుంది, అతని యాక్షన్స్ ఎక్కువగా మాస్‌ను ఆకట్టుకునేలా వున్నాయి. రవితేజ అమితాబ్ బచ్చన్‌ను ఇమిటేట్ చేసే చివరి సీన్ కన్నుల పండువగా వుంది

భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుండగా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇద్దరూ షోరీల్‌లో కనిపించారు. టెక్నికల్ గా.. అయనంక బోస్ అందించిన ఎక్స్ ట్రార్డినరీ కెమెరా వర్క్, మిక్కీ జె మేయర్ అందించిన అప్‌లిఫ్టింగ్ స్కోర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా వున్నాయి. షోరీల్ సినిమాపై అంచ‌నాల‌ను మరింతగా పెంచింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్నిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.నామ్ తో సునా హోగా అనేది సినిమా ట్యాగ్ లైన్. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి.ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి కావస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Also Read:వైసీపీ నిర్లక్ష్యం వల్లే పోలవరం ఆలస్యం!

- Advertisement -