మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
ఇక ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే రవితేజ మరో ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఇపుడు మాస్ ట్రీట్ తో అలరిస్తే నెక్స్ట్ టైం రవితేజతో ఒక సోషియో ఫాంటసీ జానర్లో సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా నిర్మాత నాగవంశీ రివీల్ చేశారు.
దీంతో మాస్ మహారాజ్ నుంచి ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ ని చూడనున్నామని చెప్పవచ్చు. మాస్ జాతర రిలీజ్ ని మే 9 రిలీజ్ కి ఫిక్స్ చేశారు కానీ ఇది కొంచెం ఆలస్యం అవుతుందని టాక్.
Also Read:IPL 2025:హైదరాబాద్‌పై లక్నో గెలుపు

