ముగిసిన రవితేజ డ్రైవర్ విచారణ

199
raviteja
- Advertisement -

డ్రగ్స్ విచారణలో హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ విచారణ ముగిసింది. నిన్న రవితేజను 9 గంటల పాటు విచారించిన అధికారులు ఇవాళ శ్రీనివాస్‌ విచారణ కేవలం మూడున్నర గంటల్లోనే ముగించడం విశేషం. కెల్విన్ కాల్ లిస్టులో శ్రీనివాసరావు నెంబర్ ఉండటంతో ఆయనను విచారణకు పిలిచారు. విచారణ సందర్భంగా కెల్విన్, జీశాన్ లతో ఉన్న సంబంధాలపై అధికారులు ప్రశ్నించారు.

కెల్విన్ నుంచి సినీ ప్రముఖులకు శ్రీనివాసరావే డ్రగ్స్ సరఫరా చేసేవాడని సిట్ అధికారుల దగ్గర సమాచారం ఉండటంతో ఆ దిశగా ప్రశ్నలడిగినట్లు సమాచారం. విచారణ అనంతరం ఆయన బైక్ పై వెళ్లిపోయారు.

డ్రగ్స్  కేసులో అధికారుల బృందం ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి, నవదీప్, తరుణ్, కెమెరామెన్ శ్యామ్ కేనాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ముమైత్ ఖాన్, ర‌వితేజ‌ను వివిధ కోణాల్లో ప్రశ్నించి..కేసుకు సంబంధించి పలు వివరాలను సేకరించిన విషయం తెలిసిందే.

సోమవారం హీరో తనీష్‌, మంగళవారం నందూను సిట్‌ అధికారులు విచారణ చేయనున్నారు. కాగా ఆగస్ట్‌ రెండో తేదీతో తొలివిడత సిట్‌ విచారణ ముగియనుంది.

- Advertisement -