మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమా డిస్కో రాజా. వీఐ ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నభా నటేశ్, ఆర్ఎక్స్ 100 పాయల్ రాజ్ పుత్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈమూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా తాజాగా ఈమూవీలో రవితేజ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. పోస్టర్ లో రవితేజ కొత్త లుక్ లో దర్శనిమిచ్చాడు. ఓ చేతిలో ఖరీదైన సిగార్, మరోచేతిలో గన్, కాళ్ళ మధ్యలో మాట్లాడుతూ వదిలేసిన ల్యాండ్ ఫోన్‌తో పగలబడి నవ్వుతున్న పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో తమిళ స్టార్ బాబీ సింహా కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈమూవీలో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు చెబుతున్నారు. సునీల్ , వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని రోజుల ముందు కుర్ర లుక్ లో ఉన్న రవితేజ పోలికలతో ఉన్న ఒక పిక్ తెగ వైరల్ కావడంతో, రవితేజ కొత్త లుక్ అంటూ సోషల్ మీడియా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ లుక్ డిస్కో రాజా సినిమాలోనిది కాదని స్పష్టం చేశారు దర్శకుడు వీఐ ఆనంద్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈమూవీని నవంబర్ లో విడుదల చేయనున్నారు.