రవితేజ….ధమాకా అప్‌డేట్

75
rt
- Advertisement -

మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కినల‌ ఫ‌స్ట్ క్రేజీ కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనేది ట్యాగ్ లైన్‌. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రానికి నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఏప్రిల్ 25 నుంచి న్యూ షెడ్యూల్ మొద‌లుకానుంది. ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ ఈ చిత్రానికి క‌థ,స్క్రీన్ ప్లే, సంభాష‌ణలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఇప్ప‌టికే ధ‌మాకాలో గూస్ బంప్స్ తెప్పించే ఫైట్‌సీన్లను ఫైట్ మాస్ట‌ర్ రామ్-ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో షూట్ చేశారు.

ప్రస్తుతం రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ , రావ‌ణాసుర ప్రాజెక్టుల‌తో పాటు పాన్ ఇండియా ప్రాజెక్టు టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు సినిమాలతో బిజీగా ఉన్నారు.

- Advertisement -