మట్టి కుస్తీ గ్లింప్స్ విడుదల

118
mattikusti
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై చెల్ల అయ్యావుతో దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం మట్టి కుస్తీ. ఈ రోజు విష్ణు విశాల్ పుట్టినరోజు కానుకగా స్పెషల్ గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు.

టైటిల్ సూచిస్తునట్లుగా ఈ గ్లింప్స్ విష్ణు విశాల్ రెజ్లర్ గా పరిచయం అయ్యారు. విష్ణు విశాల్ బైక్ నడుపుతూ విలన్స్ ని కొడుతూ పవర్ ఫుల్ గా కనిపించారు. చివర్లో రెజ్లింగ్ రింగ్‌లో తన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఈ గ్లింప్స్ విష్ణు విశాల్ పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ గా నిలిచింది.

మట్టి కుస్తీ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో రూపుదిద్దుకుంటుంది. విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రాఫర్ గా, ప్రసన్న ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

తారాగణం: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: చెల్లా అయ్యావు
నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్
బ్యానర్లు: ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
డీవోపీ: రిచర్డ్ ఎం నాథన్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్: ప్రసన్న జికె
ఆర్ట్ డైరెక్టర్: ఉమేష్ జే కుమార్
లిరిక్స్: వివేక్

- Advertisement -