దేశవాలి క్రికెట్‌లో అరుదైన ఫిట్ సాధించాడు భారత క్రికెటర్ రవీంద్ర జడేజా. సౌ రాష్ట్ర టీ20లో భాగంగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన జడేజా ఈ ఫీట్ సాధించిన మూడో భారత బ్యాట్స్ మెన్‌గా నిలిచాడు.
జామ్ నగర్ తరఫున బరిలో దిగిన జడేజా.. అమ్రేలీ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం పది సిక్సర్లు, 15 ఫోర్లు బాదిన జడ్డూ.. 69 బంతుల్లోనే 154 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్నర్ నీలమ్ వంజా బౌలింగ్ చెలరేగిపోయిన జడేజా.. వరుసగా ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు.
జడేజా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో జామ్‌నగర్ 20 ఓవర్లలో 239/6 పరుగులు సాధించింది. అమ్రేలీ జట్టు 118 పరుగులకే పరిమితమై 121 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పటి వరకూ భారత ఆటగాళ్లలో రవిశాస్త్రి, యువరాజ్ మాత్రమే ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డు నమోదు చేశారు. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా.. యువీ ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. 1985 రంజీ సీజన్లో ముంబై తరఫున బరిలో దిగిన రవిశాస్త్రి బరోడాపై ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు.