అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ గుడ్ బై

3
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జ‌రిగిన మూడ‌వ టెస్టు చివ‌రి రోజు అశ్విన్ త‌న రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. 106 టెస్టుల్లో 537 వికెట్లు తీశాడు అశ్విన్. అనిల్ కుంబ్లే త‌ర్వాత ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు అశ్‌విన్. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసిన విష‌యం తెలిసిందే.

అశ్విన్ టెస్టుల్లో 3503 ర‌న్స్ చేశాడు. దీంట్లో ఆరు సెంచ‌రీలు, 14 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. మూడు వేల ర‌న్స్‌, 300 వికెట్లు తీసిన 11 ఆల్‌రౌండ‌ర్ల లిస్టులో అత‌ను ఉన్నాడు. అశ్విన్ 11 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.

Also Read:డ్రాగా ముగిసిన మూడో టెస్టు

- Advertisement -