నేల టిక్కెట్ కి ఫిక్సైన మాస్ రాజా..?

185
Ravi Teja's next gets an interesting title
- Advertisement -

రీసెంట్‌ గా మాస్ రాజా రవితేజ చాలా గ్యాపిచ్చి రాజా ది గ్రేట్ సినిమాతో వచ్చాడు. అలాగే ఇప్పుడు టచ్ చేసి చూడు అంటూ జనవరి చివర్లో ఒక సినిమాతో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు.. మరో కొత్త సినిమాను రెడీ చేస్తున్నాడు. ఇక  ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణతో రవితేజ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు మొన్నటివరకు ఆపేశారనే రూమర్లు వచ్చాయి కాని.. ఇప్పుడు ప్రొడ్యూసర్ సెట్టవ్వడంతో తిరిగి పట్టాలెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను పక్కా మాస్ ఎంటర్టయినర్ తరహాలోనే తెరకెక్కిస్తున్నారట.

సినిమాలో మాస్ అంశాలన్నీ పుష్కలంగా ఉండటంతో.. సినిమాకు ఏకంగా ‘నేల టిక్కెట్’ అనే టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తోంది. సినిమా సినిమా కి చాలా గ్యాప్‌ ఇచ్చే రవితేజ ‘నేల టిక్కెట్‌’ తర్వాత స్పీడందుకుంటాడో లేదో చూడాలి.

- Advertisement -