రాజా.. నువ్వు నిజంగా గ్రేట్ !

275
Ravi Teja selfie pic goes viral after Bharat death
Ravi Teja selfie pic goes viral after Bharat death
- Advertisement -

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా టాప్‌ హీరోగా ఎదిగాడు మాస్ మ‌హరాజా ర‌వితేజ. బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ర‌వితేజ ప్ర‌స్తుతం రాజా ది గ్రేట్ , ట‌చ్ చేసి చూడు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ర‌వితేజ సోద‌రుడు భ‌ర‌త్ కారు యాక్సిడెంట్ లో మృతి చెందగా, ర‌వి తేజ త‌న‌ త‌మ్ముడిని క‌డ‌సారి చూసేందుకు కూడా వెళ్ళ‌లేదు. అంతేకాదు భరత్‌ మరణించిన తర్వాతి రోజే రవితేజ తన సినిమా షూటింగ్‌కు హాజరైపోయాడు. ఈ విషయంలో ర‌వితేజ పై తీవ్ర విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

అయితే తమ్ముడి మరణం విషయంలో రవితేజ చాలా బాధపడుతున్నాడని.. అయితే తను ప్రస్తుతం నటిస్తున్న సినిమా నిర్మాతకు నష్టం కలగకూడదనే కారణంతోనే బాధను దిగమింగుకుని షూటింగ్‌కు హాజరవుతున్నాడని రవితేజను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు కొందరు. ఇక ఇప్పుడు ర‌వితేజ త‌న టీంతో క‌లిసి దిగిన‌ ఫోటో వారికి కోపం క‌ట్ట‌లు తెంచేలా చేసింది.

ravi-teja-selfie

ప్రస్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రాజా ది గ్రేట్ అనే సినిమా చేస్తున్న ర‌వితేజ‌, ఈ సినిమా టీం స‌భ్యులు అంద‌రితో క‌లిసి సెల్ఫీ దిగారు. ఇందులో ఆయ‌న‌ న‌వ్వుతూ ఫోటోకి ఫోజులిచ్చాడు. దీంతో సోష‌ల్ మీడియాలో కొంద‌రు నెటిజ‌న్స్ ర‌వితేజ‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. త‌మ్ముడు చనిపోయాడ‌న్న బాధ కాస్తైన కనిపించ‌డం లేద‌ని వ్యంగాస్త్రాలు విసురుతున్నారు నెటిజన్లు.. ఆ ఫొటోను షేర్ చేస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రవితేజకు మద్దతిస్తుంటే.. మరికొంతమంది ‘రాజా.. నిజంగా గ్రేటే’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు..

- Advertisement -