రాజా వచ్చేస్తున్నాడు..

115
Raviteja

యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు తీరిక లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంటే..మాస్ రాజా రవితేజ మాత్రం నాకేం పట్టనట్టు ఉండిపోయాడు. ఒకప్పుడు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలను రిలీజ్ చేసిన ఈ హీరో..ఏడాదిన్నర గడుస్తున్న ఇంతకు మరో సినిమా చేయలేదు. బెంగాల్ టైగర్ సినిమానే రవితేజ లాస్ట్ సినిమా. రెండు, మూడు ప్రాజెక్ట్లు మొదలువుతున్నాయన్న వార్తలు వినిపించినా.. ఏదీ సెట్స్ మీదకు రాలేదు. రవితేజ కూడా సినిమాలు మొదలెట్టకుండా వరల్డ్ టూర్ అంటూ కాలం గడిపేసాడు. ఫైనల్గా లాంగ్ బ్రేక్ తరువాత తిరిగి షూటింగ్కు రెడీ అవుతున్నాడు మాస్ హీరో.

Raviteja

విక్రమ్ సిరి అనే కొత్త దర్శకుణ్ని పరిచయం చేస్తూ నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో రవితేజ నటిస్తున్నాడు. అయితే ఈసినిమాకు అప్పుడే టైటిల్ కూడా కన్ఫామ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. రవితేజ కు పక్కాగా సరిపోయేలా రాజా ది గ్రేట్ అనే పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజతో కలిసి బెంగాళ్ టైగర్ సినిమాలో హీరోయిన్గా నటించిన రాశీఖన్నా మరోసారి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాణంలో కూడా ఓ సినిమాకు రవితేజ ఓకే చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది.