‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదల వాయిదా..

94
Ramarao On Duty
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నాడు. ఈ సినిమాను జూన్ 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.

కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్టుగా అధికారిక ప్రకటన చేశారు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది త్వరలో ఎనౌన్స్ చేస్తామని అన్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో దివ్యాంశ కౌశిక్‌,రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు.

- Advertisement -