మాస్ మహరాజ్ రవితేజ సినిమా కోసం అభిమానులు సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమాతో డీసెంట్ హిట్ సాధించిన రవితేజ, ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందన్న తరుణంలో ఆగిపోవటంతో కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఈ గ్యాప్‌లో వరల్డ్ టూర్ కు వెళ్లొచ్చిన మాస్ హీరో.. ఫైనల్‌గా కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఇన్నాళ్లు రూమర్స్ గానే ఉన్న వార్తలపై క్లారిటీ ఇస్తూ కొత్త సినిమా పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. టచ్ చేసి చూడు అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు విక్రమ్ సిరకొండ దర్శకుడు. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే మాస్ మహరాజ రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ‘రాజా ది గ్రేట్’.. రెండవది విక్రమ్ సిరి దర్శకత్వంలోని ‘టచ్ చేసి చూడు’.మరి ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో వున్నాయి. ‘టచ్ చేసి చూడు’లో రవితేజ మాస్ పోలీస్ గా సందడి చేయనున్నాడు. అలాంటి ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరి రంజాన్ రోజున ఈ టీజర్ ను విడుదల చేయనున్నారు. టీజర్ తోనే అంచనాలు ఒక రేంజ్ లో పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రవితేజ సరసన రాశి ఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను, ఆగస్టు 21వ తేదీన విడుదల చేయనున్నారు. ‘జై లవ కుశ’ టీజర్ రిలీజ్ రోజునే .. ‘టచ్ చేసి చూడు’ టీజర్ ను రిలీజ్ చేస్తుండటం విశేషం.అయితే రవితేజ చాలాకాలం తర్వత వచ్చే సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే పెరుగుతున్నాయి.