‘ఖిలాడి’గా మాస్ మహరాజా..

41
Ravi Teja

మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న 67వ సినిమాకు సంబంధించి టైటిల్‌తో పాటు, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘ఖిలాడి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘రాక్ష‌సుడు’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ డైరెక్షన్‌లో ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని కాసేపట్లో ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా… డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘మరో అద్భుత ప్రయాణానికి సర్వం సిద్ధం’ అని రవితేజ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.