మరోసారి మాస్‌ డైరెక్టర్‌తో మాస్ మ‌హరాజా..

223
Ravi Teja
- Advertisement -

టాలీవుడ్‌ మాస్ మ‌హరాజా ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న‌ప్ప‌టికి, ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. గతంలో ర‌వితేజ న‌టించిన రాజా ది గ్రేట్ చిత్రం మాత్రమే భారీ విజ‌యం సాధించింది. ఇప్పుడు మ‌రో స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ మాస్ మ‌హరాజా.

తాజాగా డైరెక్టర్‌ వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కోరాజా అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్‌లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండ‌గానే మ‌రో సినిమాని ర‌వితేజ లైన్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తుంది. మాస్‌ డైరెక్టర్‌ వి.వి వినాయక్, రవితేజ కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతుందని సినీ వర్గాల బోగట్టా.

Ravi Teja

తాజా సమాచారం ప్రకారం వి.వి వినాయక్ రవితేజకు కథ వినిపించారని.. రవితేజకు కూడా కథ బాగా నచ్చిందని సమాచారం. కాగా వీరి కాంబినేషన్‌లో రెండో సినిమాగా త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్ లో ‘కృష్ణ’ సూపర్ హిట్ చిత్రం వచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. మళ్లీ ఇంతకాలానికి వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. మరి ఈ సినిమాతోనైనా వినాయక్ హిట్ కొడుతాడో చూడాలి.

- Advertisement -