రవితేజ రెండేళ్ల గ్యాప్‌ను ఓకే ఏడాదిలో కవర్ చేస్తున్నాడు. ఈయన జోరుకు బ్రేకులు వేయడం కష్టంగా మారిందిప్పుడు. వరసగా సినిమాలు ఒప్పుకుంటూ సత్తా చూపిస్తున్నాడు ఈ మాస్ రాజా. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలు చేసిన రవితేజ.. మూడో సినిమాతో సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు మరో సినిమాకు సై అనేసాడు. అయితే రవితేజ తను నటిస్తున్న సినిమాలతో ప్రేక్షకులను మెప్పించకపోయినా తనలో జోరు ఏమాత్రం జోరు తగ్గలేదని నిరూపిస్తున్నాడు. ఈ మాస్ మహారాజ నటించిన టచ్ చేసి చూడు, నేల టికెట్ సినిమాలు ప్లాప్ కాగా తాజాగా మరోసారి అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ.
శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన ఇలియానా నటించింది. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే రవితేజ ఇప్పటికే మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో నటించేందుకు రవితేజ ఓకే చెప్పాడట. ఈ సినిమాను ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈ మూవీకి ‘డిస్కో రాజా’ టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలను తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట.
‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేశ్‌ను ఓ నాయిక కాగా , ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారట. మరో నాయికను త్వరలో ఎంపిక చేస్తారట. సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరకర్త. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేపథ్యంలో సాగనున్ననేపథ్యంలో తమిళ స్టార్ బాబీ సింహాని ప్రతి నాయకుడిగా ఎంపిక చేశారట. మాస్ మహారాజ కథానాయకుడిగా, బాబి సింహా ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.