మరోసారి టీంఇండియా కోచ్ గా రవిశాస్త్రి

459
india Coach Ravishasri
- Advertisement -

టీంఇండియా కోచ్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం హెడ్ కోచ్ గా ఉన్న రవిశాస్త్రికే మరోసారి అవశారం ఇస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేశారు. టీంఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నేతృత్వంలోని కమిటీ రవిశాస్త్రీని ఎంపిక చేసింది.

భారత ఆటగాళ్లపై రవిశాస్త్రికి సంపూర్ణ అవగాహన ఉందని, అన్ని అంశాలపై పూర్తి అవగాహనతో ఆయన పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. 2017 నుంచి భారత జట్టు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి.. తాజా నిర్ణయంతో 2021 వరకు టీమిండియా హెడ్‌ కోచ్‌గా కొనసాగనున్నారు.

కాగా, టీమిండియా కోచ్ రేసులో ఆరుగురు బరిలో నిలిచారు. ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత రవిశాస్త్రిని ఎంపిక చేసినట్టు కపిల్ దేవ్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానల్ వెల్లడించింది. రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టాక శ్రీలంకలో మూడు టెస్టుల సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వన్డే సిరీస్, 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది. ఇండియా టీంకు వరుసగా రెండు పర్యాయాలు హెడ్ కోచ్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు రవిశాస్త్రి.

- Advertisement -