పబ్లిసిటీ కోసం పందిపిల్లతో..

214
- Advertisement -

పబ్లిసిటీ. ఈ పదానికి కాస్త పవర్ ఎక్కువ. పబ్లిసిటీ కోసం పరితపించని వారుండరనుకో. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇంకాస్త ఎక్కువే అని చెప్పాలి. కొంత మంది సినీ ప్రముఖులు ప్రతీ సందర్భాన్ని తమ సినిమాల ప్రమోషన్లకు వాడేసుకుంటారు. ముఖ్యంగా లో బడ్జెట్తో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్లతో సినిమాలు చేసే రవిబాబు లాంటి దర్శకులు ఇలాంటి ప్రయోగాలు బాగా చేస్తుంటారు. తాజాగా ఈ దర్శకుడు ఓ పందిపిల్లతో ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. పంది పిల్ల లీడ్ రోల్లో ‘అదిగో’ సినిమాను తెరకెక్కిస్తున్న రవిబాబు, ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

Director-Ravi-Babu

త్వరలో రిలీజ్ కు సిద్ధం కాబోతున్న అదిగో ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఈ క్రియేటీవ్ డైరెక్టర్ రవిబాబు వినూత్నంగా నిర్వహించాడు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీయంల ముందు క్యూ కడుతున్నారు. అందుకే తన సినిమా ప్రమోషన్కు అదే కరెక్ట్ ప్లేస్ అని భావించిన రవిబాబు, తన సినిమా హీరో పందిపిల్లతో కలిసి ఏటీయం క్యూ లైన్లో నిలుచున్నాడు.

Director-Ravi-Babu

రవిబాబు లాంటి స్టార్ క్యూ లైన్లో కనిపించడమే షాక్ అనుకుంటే, చంకలో పందిపిల్లతో కనిపించటంతో ఈ వార్త ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారింది. పందిపిల్ల లీడ్ రోల్‌గా సినిమా చేయడమే వెరైటీ అనుకుంటే..ఇలా పందిపిల్లతో ఏటీమం క్యూ లో నిలుచుని తన అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు రవిబాబు. మరి ఈ పందిపిల్ల ప్రయోగం సినిమాకు ఎంతగా ఉపయోగపడుతుందో చూడాలి.

Director-Ravi-Babu

- Advertisement -