మహిళలపై సినీనటుడు చలపతి రావు వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. చలపతి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనపై తీవ్రస్ధాయిలో ద్వజమెత్తుతున్నారు.
సుమారు 50 ఏళ్ల సినీ జీవితంలో అనేక సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటుల్లో ఒకడిగా ఉంటూ వివాదాలకు దూరంగానే గడిపిన చలపతిరావు ఒకే ఒక్క మాట ఆయన పరువును గంగలో కలిసిపోయేలా చేసింది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను ఉద్దేశించి చేసిన నీచమైన కామెంట్స్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన క్షమాపణ కూడా చెప్పారు.
డబ్భై మూడేళ్ల వయసులో, 50 సంవత్సరాల సినీ జీవితంలో, అనాలోచితంగా, అన్యాపదేశంగా నేను చేసిన ఒక వ్యాఖ్య, దురదృష్టకరం. ఒక మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న ఇది.‘ఆడవాళ్లతో హానికరమా’ దానికి జవాబుగా నేను ‘ఆడవాళ్లు హానికరం కాదు’. ఆ తరువాత నేను చేసిన ఒక వ్యాఖ్యను టీవీల్లో పదేపదే ప్రసారం చేసి నన్ను ఒక చరిత్ర హీనుడిగా మార్చేశారని’ వాపోయారు.
అయితే వివాదం జరిగి నాలుగు దాటుతున్నా.. వేడి ఇంకా చల్లారలేదు. పలు మహిళా సంఘాలతో పాటు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు, మా అసోసియేషన్ సైతం హెచ్చరికలు జారీ చేయండంతో ఆయన చేసిన తప్పుకు పలుమార్లు క్షమాపణలు చెప్పినా వివాదాన్ని అంతకంతకూ ఎక్కువ చేస్తున్నారని ఇలా మానాన్నను పలుమార్లు మానసికంగా హింసించడం కంటే.. రాళ్లు తీసుకుని ఒకేసారి శారీరకంగా కొట్టి చంపేయండంటూ ఆయన కొడుకు ప్రముఖ దర్శకుడు,నటుడు రవిబాబు అవేదన వ్యక్తం చేశారు.
మా నాన్నకు మద పిచ్చి ఎక్కువైపోయి ఆ కామెంట్స్ చేశారంటున్నారు. నిజమే మా చిన్నప్పుడే మా తల్లి చనిపోతే మళ్లీ పెళ్లి చేసుకుంటే వచ్చే ఆవిడ మమ్మల్ని ఎక్కడ సరిగా చూసుకోదేమో అని తన సుఖాలను త్యాగం చేశారు నా తండ్రి. ఆయన నోరు జారారు. అది ముమ్మాటికీ తప్పే. చేసిన తప్పుకు ఆయనకు ఇప్పటికే చాలా పెద్ద శిక్ష వేశారు. ఆయన ఎంత మనోవేదన పడుతున్నారో నాకు తెలుసు. ఇంతకంటే పెద్ద శిక్ష మరోటి లేదు.
కాని కొంత మంది ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేయాలని చూస్తున్నారు . కారణం మా నాన్న అతి సామాన్యుడు , గతంలో చాలా మంది పెద్దవాళ్లు ఆడవాళ్లపై ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు మా నాన్నపై విరుచుకుపడుతున్నాయి అని తన ఆవేదనను తెలియజేశారు రవిబాబు.