వైసీపీలో మొదలైన రాజీనామాల పర్వం

14
- Advertisement -

అధికారం కొల్పోయిన వైసీపీకి నేతల రాజీనామాలతో కొత్త తలనొప్పి వచ్చి పడింది. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జగన్‌కు పంపిన రావెల.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వైసీపీతోనే సాధ్యమని పార్టీలో చేరానని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు.

ఎస్పీ వర్గీకరణ కోసం కృషి చేసేందుకు వైసీపీని వీడుతున్నానని…త్వరలోనే వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సంక్షేమం, సమగ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని కూటమికి చారిత్రక విజయం సాధించిపెట్టారని… చంద్రబాబు నాయకత్వంలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సమర్ధవంతంగా పనిచేసి పేద ప్రజలకు సేవచేశానని తెలిపారు. దురదృష్టవశాత్తూ కొన్ని కారణాల వల్ల టీడీపీలో కొనసాగలేకపోయానని చెప్పారు.

Also Read:భజే వాయు వేగం..మా నమ్మకాన్ని నిలబెట్టింది

- Advertisement -