తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా లబ్దిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అనేక జిల్లాల్లోని రేషన్ షాపుల ముందు దర్శనమిస్తున్నాయి నో స్టాక్ బోర్డులు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నెల 15వ తేదీ లోపు లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తామని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఈరోజు వరకు కూడా రేషన్ షాపులకు చేరుకొలేదు సన్న బియ్యం.
పథకం ప్రారంభించిన నెల రోజులకే ఇంత నిర్లక్ష్యమేంటని ప్రశ్నిస్తున్నారు లబ్ధిదారులు . అయితే లబ్ధిదారుల ఒత్తిడి తట్టుకోలేక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఉన్న రేషన్ షాపుల ముందు నో స్టాక్ బోర్డును పెట్టుకున్నారు డీలర్లు.
ఇప్పటికే సన్నబియ్యంలో అధికమొత్తంలో నూకలు వస్తున్నాయని, డీలర్లు సమయపాలన పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు లబ్ధిదారులు. 15వ తేదీ వచ్చినా చాలా మందికి సన్న బియ్యం అందలేదని, గడువు పెంచాలని డిమాండ్ చేశారు లబ్ధిదారులు.
Also Read:సరస్వతీ పుష్కరాలు.. ప్రారంభం

