క్రిష్…రథం

303
Ratham Theatrical Trailer
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్‌లో చిన్న సినిమాల ట్రెండ్ నడుస్తోంది. చిన్నసినిమాలన్ని భారీ వసూళ్లను రాబడుతుండటంతో ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి పెరిగిపోయింది. తాజాగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రథం మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. యుగాల నాటి కురుక్షేత్రం కూడా ధర్మం కోసమే అనే ట్యాగ్ లైన్‌తో వస్తుండగా సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరితో ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్ రిలీజ్ చేయిస్తూ మూవీని ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్.

తాజాగా దర్శకుడు క్రిష్..రథం సినిమాకి బూస్ట్ ఇచ్చారు. సినిమా ట్రైలర్ ను ట్విట్టర్ లో లాంచ్ చేశారు. గీత్‌ ఆనంద్, చాందినీ భగ్వానాని హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రానుంది.

ఈ చిత్రానికి సుకుమార్ పమ్మి సంగీతం అందిస్తుండగా,రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎ.వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మిస్తున్నాడు. నటీనటులు : గీత్‌ ఆనంద్, చాందినీ భగ్వానాని, నరేన్,సాంకేతిక నిపుణులు :దర్శకుడు : చంద్రశేఖర్ కానూరి,సమర్పణ : ఎ.వినోద్,నిర్మాత : రాజా దారపునేని,బ్యానర్ : రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌,మ్యూజిక్ డైరెక్టర్ : సుకుమార్ పమ్మి,పీఆర్‌వో : వంశీ శేఖర్

- Advertisement -