Ratan Tata: RIP..మళ్లీ తిరిగి వస్తారా!

8
- Advertisement -

ఒక శకం ముగిసింది. పారిశ్రామిక వేత్తగానే కాదు దాతృత్వానికి మారుపేరు. వినయం, విధేయత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చాటిచెప్పిన ఆదర్శమూర్తి. ప్రపంచపటంపై టాటా సంస్థను నిలబెట్టిన ఆయన తీరు ఎంతోమంది యువ పారిశ్రామిక వేత్తలకు ఆదర్శం.

ఉప్పు మొదలు ఉక్కు వరకూ ప్రతిదాంట్లో ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు రతన్ టాటా. అందుకే ఆయన మరణం పట్ల ప్రతిఒక్కరూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. లాభార్జనకంటే చిత్తశుద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అందుకే రతన్‌ టాటా అంటే అందరికీ అపారమైన గౌరవం. జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను కొనుగోలు చేసి టాటా కంపెనీని వరల్డ్‌ బ్రాండ్‌గా మార్చారు.

దేశ, విదేశాల ప్రముఖులు RIP అని ట్వీట్ చేశారు. అయితే కొంతమంది RIPకు సరికొత్త అర్ధం వచ్చేలా Sir return if possible(సార్ మళ్లీ తిరిగి వస్తారా) అని ట్వీట్ చేస్తున్నారు.

Also Read:వ్యాయామం లేకుండా ఇలా బరువు తగ్గండి!

- Advertisement -