పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ఇకలేరు. ఆయన వయస్సు( 86). వయోభారంతో గత కొన్ని రోజులుగా ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రతన్ టాటా బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స అందిస్తూ వస్తున్నారు డాక్టర్లు. అయితే బుధవారం పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే ప్రాణాలు వదిలారు.
1991లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు రతన్ టాటా. ఆతర్వాత 1996లో టెలి కమ్యూనికేషన్స్ కంపెనీ అయిన టాటా టెలిసర్వీసెస్‌ను, 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని ప్రారంభించి…పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక అడుగులు వేశారు. ప్రస్తుతం టాటా గ్రూప్ 100 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా ఎదగిందంటే అది రతన్ టాటా కృషే.
రతన్ టాటా ఇండస్ట్రియలిస్టే కాదు గొప్ప మానవతావాది కూడా . రతన్ టాటా సంపాదించిన లాభాల్లో దాదాపు 60 నుంచి 65శాతం సేవా కార్యక్రమాల కోసం విరాళంగా అందించారు. 2000లో పద్మ భూషణ్, 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించాయి అప్పటి ప్రభుత్వాలు.
Also Read:Rahul: జమ్మూలో రాజ్యాంగ విజయం