ర్యాట్ ఫీవర్ లక్షణాలివే..!

12
- Advertisement -

తెలుగు రాష్ట్రాలను వర్షాలను ముంచెత్తాయి. భారీ వర్షాలతో వ్యాధులు సైతం విస్తరిస్తున్నాయి. తాజాగా ఏపీలో ర్యాట్ ఫీవర్ తొలి కేసు నమోదైంది. అల్లూరుకు చెందిన వ్యక్తి ర్యాట్‌ ఫీవర్‌ తో బాధపడుతున్నట్లు సమాచారం. అతనికి వైరల్‌ ఫీవర్‌ ఎక్కువవ్వడంతో చెన్నైలో వైద్యం చేయించుకున్నారు.

ర్యాట్‌ ఫీవర్‌ ప్రాణాంతకమని, తాగే నీటిలో ఎలుకలు, పందికొక్కులు మూత్ర విసర్జన చేయడం వలన ఈ వ్యాధి సోకుతుంది. ఆ నీటినే మనిషి తాగినప్పుడు ఈ జ్వరం వస్తుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదు.

నీటిని శుభ్రంగా ఉంచుకొని ఎలుకలు, పందికొక్కులతో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ర్యాట్ ఫీవర్ నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిని రోగి ప్రాణానికే ముప్పు వచ్చే అవకాశం ఉంది. ర్యాట్‌ ఫీవర్‌ వచ్చాక వారం రోజుల తర్వాత శరీరంపై దద్దుర్లు వస్తాయన్నారు. వైరస్‌ నిర్ధారణ కోసం కిట్లు అందుబాటులో ఉన్నాయి.

ర్యాట్ ఫీవర్ లక్షణాలు ఇవే. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు,శరీరం ఎర్రబడడం,చర్మంపై దద్దుర్లు,కామెర్లు వస్తాయి. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి నీటి ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. లెప్టోస్పిరోసిస్ అనేది ఎలుకలు, కుక్కలలో సాధారణంగా కనిపించే వైరస్.

Also Read:తెలంగాణకు కేంద్ర బృందం..

- Advertisement -