కొత్త కొత్త టేస్ట్‌లు చూపిస్తానంటున్న రష్మి.. ట్రైలర్

390
- Advertisement -

ఆకట్టుకునే కంటెంట్ ఉంటే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి మంచి కంటెంట్ తో వస్తోన్న చిత్రమే ‘‘శివరంజని’’.హాట్ బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా నందినిరాయ్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్ర ట్రైలర్ ను సెన్షేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు.

Director VV Vinayak

ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ చాలా బావుంది. టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పుడు వస్తోన్న హారర్ చిత్రాలకు భిన్నమైన కంటెంట్ ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని.. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి చిన్న చిత్రాలకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. ఇలాంటి నిర్మాతలకు మంచి విజయాలు వస్తే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఇంకా ఎక్కువగా షైన్ అవుతాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలకు మంచి పేరుతో పాటు డబ్బులు కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Director VV Vinayak

యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సురేందర్ రెడ్డి, సంగీతం : శేఖర్ చంద్ర, సమర్పణ : నల్లా స్వామి, పి.ఆర్.ఓ : జి.ఎస్.కే మీడియా, సహ నిర్మాత : కటకం వాసు, నిర్మాతలు : ఏ పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు, దర్శకత్వం : నాగ ప్రభాకరన్.

- Advertisement -