పెళ్లి పై రష్మిక షాకింగ్ కామెంట్స్

14
- Advertisement -

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందానా ఇటీవల ఓ కార్యక్రమంలో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నరుటోతో నా పెళ్లైపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు’ అని చెప్పారు. అయితే నరుటో అంటే మనిషి కాదు, ‘ఎనిమీ’ అనే సిరీస్‌లో ఓ పాత్ర పేరు. ఈ సిరీస్‌కు, అందులోని పాత్రలకు ప్రత్యేకమైన అభిమానగణం ఉంటుంది. అందులో రష్మిక కూడా ఒకరు. రష్మిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మొత్తానికి రష్మిక మందాన్నాకి ఫుల్ క్రేజ్ ఉంది. అలాంటి రష్మిక ఇప్పుడు ఓ కుర్ర హీరో సినిమా ఒప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది.

ఇంతకీ రష్మిక మందన్నా ఏ హీరో సినిమా ఒప్పుకుందో తెలుసా?, సిద్ధు జొన్నలగడ్డకి జంటగా రష్మిక నుంచి ఓ మూవీ రానుంది. ఇండస్ట్రీలో ‘డీజే టిల్లు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సిద్ధు త్వరలోనే ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళ్, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న రష్మిక.. ఈ సినిమా ఒప్పుకోవడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Also Read:ముగిసిన బీఏసీ..3 రోజులు అసెంబ్లీ సమావేశాలు

అలాగే వీళ్లిద్దరి కాంబినేషన్ కలిపింది ఒక డెబ్యూ డైరెక్టర్ కావడం విశేషం. ఇంతకీ డీజే టిల్లుతో సినిమాకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే.. ఆమెకు కథ బాగా నచ్చడం, అలాగే తన పాత్ర బాగా నచ్చడంతో రష్మీక ఈ సినిమా ఒప్పుకుందట. మరి రష్మిక మందానాకి ఈ సినిమా ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి.

Also Read:ఆ హీరోయిన్ని ఎలా తప్పు పట్టగలం?

- Advertisement -