విజయ్ పై రష్మిక కొత్త ముచ్చట్లు

29
- Advertisement -

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, యంగ్ హీరో విజయ్ దేవరకొండలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రష్మిక విజయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నేను చేసే ప్రతి పనిలో విజయ్ దేవరకొండ సహకారం ఎప్పుడూ ఉంటుంది. అతని సలహా తీసుకుంటా. అది నాకు అవసరం. ఏది మంచో, ఏది చెడో వివరిస్తారు. అలా చెప్పడం బాగుంటుంది. వ్యక్తిగతంగా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్‌ చేశారు’ అని వెల్లడించారు. పైగా రష్మిక ఇంకా మాట్లాడుతూ.. ప్రతి పనిలో అతని సహకారం, సలహాలను తీసుకుంటా అంటూ రష్మిక చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరోపక్క వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక లేటెస్ట్ కామెంట్స్ ఆ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. హీరో విజయ్ దేవరకొండ గతేడాది లైగర్ సినిమా పరాజయం తర్వాత ‘ఖుషి’ మూవీతో తిరిగి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆయన త్వరలోనే ‘ఫ్యామిలి స్టార్’ మూవీతో రాబోతున్నాడు. అయితే విజయ్ త్వరలోనే ‘VD18’ మూవీ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటింటనున్నట్లు సమచారం.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో కొత్త ప్రారంభం.. #VD18 అని ట్యాగ్ ఇచ్చింది. దీనిబట్టి విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ తర్వాత హరీశ్ శంకర్ తో కూడా ఓ సినిమా చేయనున్నట్లు టాక్.అయితే ఈ సినిమాకు అశ్వినీదత్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్ల సినీవర్గాల్లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.

Also Read:KCR:తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం

- Advertisement -