డార్లింగ్‌తో డేట్‌ అంటున్న రష్మిక..

32
Rashmika

టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నవరుస సినిమాలతో దూసుకుపోతుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా బిజీ అయిపోయింది. 25 ఏళ్ల ఈ భామ తెలుగులోనే కాదు, తమిళంలో సైతం వరుస ఆఫర్లు కోట్టేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సినీ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే విషయాన్ని వెల్లడించింది.

మీరు డేటింగ్ కు వెళ్లాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ… తెలుగు స్టార్ హీరోతో తాను డేట్ కు వెళ్లాలనుకుంటున్నానని చెప్పింది. ఆ స్టార్ ఎవరో కాదు… పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్. తనకు అవకాశం వస్తే.. ఏదో ఒకరోజు ప్రభాస్ తో డేట్ కు వెళ్తానని రష్మిక తెలిపింది. ప్రభాస్ కు తాను పెద్ద ఫ్యాన్ నని చెప్పింది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. ఇదే సమయంలో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. ‘మిషన్ మజ్ను’ సినిమా ద్వారా ఉత్తరాదికి పరిచయం కాబోతోంది.