‘ఆచార్య’ రామ్ చరణ్ కు జోడిగా రష్మీక

469
Rashmika-Mandanna

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇటివలే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈమూవీలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీలో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. కాగా ఈమూవీలో రామ్ చరణ్ ఓ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

దాదాపుగా అరగంట పాటు చరణ్ కనిపించనున్నాడట. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించబోతుందని తెలుస్తుంది. ముందు ఈ పాత్ర కోసం కియారా అద్వానీతో సమంత, పూజా హెగ్డేను కూడా అడిగినా కూడా వాళ్లు ఆసక్తి చూపించకపోవడంతో రష్మిక మందన్నను తీసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా చిరంజీవి సినిమాను నిర్మిస్తున్నాయి.