రష్మిక నిశ్చితార్థం రద్దు.. క్లారిటీ ఇచ్చిన తల్లి

323
Rashmika Mandanna
- Advertisement -

హీరోయిన్‌ రష్మిక మందన, నటుడు రక్షిత్‌ శెట్టిల నిశ్చితార్థం 2017లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిశ్చితార్థం రద్దు అయ్యిందని కొన్ని రోజులుగా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. భిన్నాభిప్రాయాలు రావడంతో తమ ప్రేమ బంధానికి రష్మిక, రక్షిత్‌ స్వస్తి పలికినట్లు తెలుసుంది. నటిగా మంచి అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కెరీర్‌లో సక్సెస్‌ పొందాలని రష్మిక ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Rashmika Mandanna

రష్మిక వివాహ నిశ్చితార్థం రద్దైన విషయాన్ని ఆమె తల్లి సుమన్ స్పష్టం చేశారు. తన కుమార్తె నిశ్చితార్థం రద్దయిందని చెప్పారు. ఇరు కుటుంబాల మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తామంతా చాలా డిస్టర్బ్ అయ్యామని… ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ జీవితం చాలా ముఖ్యమని… ఎదుటి వ్యక్తి బాధ పెడితే ఎవరికీ ఇష్టం ఉండదని తెలిపారు.

2016లో హిట్‌ అందుకున్న కన్నడ సినిమా ‘కిర్రిక్‌ పార్టీ’. ఈ సినిమాతో రష్మిక కథానాయికగా పరిచయం అయ్యారు. ఇందులో రక్షిత్‌ కథానాయకుడు. ఈ సినిమా సమయంలో ఇద్దరు స్నేహితులయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2017 జులై 3న నిశ్చితార్థం జరిగింది. అంతేకాదు నిశ్చితార్థం జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా కొన్ని నెలల క్రితం వీరిద్దరు వేడుక కూడా చేసుకున్నారు.

- Advertisement -