స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటివలే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా రెగ్యూలర్ షూటింగ్ ను ఈనెల 24నుంచి ప్రారంభించనున్నారు. ఈమూవీతో పాటు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో కూడా నటించనున్నాడు బన్నీ. ఇన్ని రోజులు ఖాళిగా ఉన్న బన్నీ ఒకే సారి రెండు సినిమాల్లో నటించేందుకు సిద్దమయ్యాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ హీరోయిన్ రష్మీక ను తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ..కెరీర్ తొలినాళ్లలోనే ప్రేక్షకుల మనసు దోచేసుకుంది. ఆతర్వాత గీత గోవిందం సినిమాతో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది.
ఇప్పుడు తాజాగా బన్నీ సరసన ఛాన్స్ కొట్టేసింది రష్మీక. ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం కానుంది. ఈమూవీతో పాటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే చిత్రాన్ని చేయనున్నాడు. ఈసినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. ఈమూడు సినిమాలతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు బన్నీ.