విజయ్ దేవరకొండ – రష్మికా మందన్న వివాహం ఈ నెల 26న ఉదయపూర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుకలు ప్రారంభమైన నేపథ్యంలో పాత ఇంటర్వ్యూలు, ఫోటోలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీసీ మెమెంటోస్‌లో వీరు వివాహం చేసుకోనున్నారు.
ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ…నా మొదటి ఆన్‌స్క్రీన్ కిస్ ‘గీతా గోవిందం’లో జరిగింది. మొదటిసారి కిస్ సీన్ చేయడం చాలా వ్యక్తిగతమైన విషయం. అది చాలా ఇంటిమేట్. సెట్‌లో దాదాపు 200 మంది చూస్తున్నారు. అప్పుడు ‘ఇది ఎలా చేస్తాం?’ అనిపించింది. విజయ్‌కూ అదే ఫీలింగ్ ఉండేది అని తెలిపారు.
అంతేకాక,…ఇది టెక్నికల్ విషయం కూడా. కథ, పాత్ర అవసరాన్ని బట్టి చేస్తాం. ‘గీతా గోవిందం’లో మేము పెళ్లైన జంటగా నటించాం. పెళ్లి తర్వాత అలాంటి సన్నివేశాలు సహజమే. అయినా అది నాకు మొదటి కిస్ సీన్ కావడంతో షాకింగ్‌గా అనిపించింది అని చెప్పారు.
Also Read:TG:తెలంగాణ రెయిన్ అలెర్ట్!
తర్వత వీరిద్దరూ జంటగా నటించిన డియర్ కామ్రేడ్ సహా పలు సినిమాల్లో వారి కెమిస్ట్రీ అభిమానుల ప్రశంసలు పొందింది.

