హిట్,ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది రష్మికా మందన్నా. టాలీవుడ్,కోలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా తన అద్భుత నటనతో ఆకట్టుకుంటున్న రష్మికా…బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఇటీవల సీతారామం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు విజయ్- రష్మికా.
దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుగుండగా దీనిపై స్పందించారు రష్మికా. తాను నటిని. సంవత్సరానికి ఒక అయిదారు సినిమాలు చేస్తున్నాను. మీరు నా సినిమాల గురించి అడగండి. అంతే కానీ మీ బాయ్‌ఫ్రెండ్ ఎవరు? ఎవరితో డేట్ చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారని కౌంటర్ ఇచ్చింది.
తన వ్యక్తిగత జీవితంపై ఉన్న ఆసక్తి కారణంగానే మీరంతా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. నా నోటితో నేను చెప్పేంతవరకు ఇలాంటి వార్తలని ఎవరూ సీరియస్‌గా తీసుకోకండి. ఈ వార్తలని జస్ట్ విని ఎంజాయ్ చేసి వదిలేయండని కొట్టిపారేసింది.