రష్మి గౌతమ్ కంటికింపుగా ఉందట

17
- Advertisement -

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన రష్మి గౌతమ్ చాలా త్వరగానే లైమ్ లైట్ లోకి వచ్చింది. నెటిజన్లు ఆమె అందాన్ని పొగడడం, ఆమె వీడియోలను వైరల్ చేయడంతో ఒక్కసారిగా రష్మి గౌతమ్ కి క్రేజ్ పెరిగింది. ఆ వెంటనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల వల్ల ఆమె మరింత పాపులర్ అయింది. పైగా హీరోయిన్ గా కూడా చలామణి అయింది. ఐతే, సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దాంతో రష్మి గౌతమ్ కి ఛాన్స్ లు తగ్గాయి. ఇక చేసేది ఏమి లేక సినిమాల నుంచి బయటికి వచ్చాక ఏవో షోలలో అవకాశాలనీ, స్పెషల్ పాటలు అని హడావిడి చేసే ప్రయత్నం చేస్తోంది.

ఏది అయితే ఏం రష్మి గౌతమ్ బాగానే సంపాదించుకొంది. అందుకే, ఇక తన ఫిజిక్ పై కసరత్తులు మానేసింది. గత ఏడాది వరకూ స్లిమ్ బాడీ మెయింటైన్ చేసిన రష్మి గౌతమ్, ఏడాది తిరగ్గానే మొత్తం మారిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం ఆమె ఫోటోలు చూస్తే చాలు, ఆమె ఇప్పుడు ఎంత బొద్దుగా మారిపోయిందో అర్థం అవుతుంది. ఇదివరకు రష్మి గౌతమ్ సన్నని తీగలా ఉండేది. ఓ దశలో ఆమెను జూనియర్ ఇలియానా అని కుర్రకారు పొగిడేవారు. ఇప్పుడు ఆమె ఇలా బొద్దుగా మారడంతో కామెంట్స్ వేరేలా ఉంటున్నాయి.

రష్మి గౌతమ్ కండ చేసింది అని ఒకరు, ముసలిది అయిపోయిందని మరొకరు ఇలా సాగుతున్నాయి కామెంట్స్. అసలు ఏడాదిలోనే రష్మి గౌతమ్ లో ఇంత మార్పు రావడం ఏంటి అని అంటున్నారు. ఐతే, బొద్దుగా ఉంటేనే బాగున్నావు అని అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అంటోంది ఈ భామ. ఇప్పుడే “నిండుగా”, “కంటికింపుగా” ఉన్నాను అని ఫ్రెండ్స్ కూడా అంటున్నారు అని చెప్తోంది. ఆ మాట ఏమో కానీ ఇక్కడితో కంట్రోల్ చెయ్యకపోతే ఆ తర్వాత రష్మి గౌతమ్ కెరీర్ కష్టమే అని అంటున్నారు.

Also Read:Harishrao:బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు

- Advertisement -