ఇక్కడ ఎవరూ రేప్ చేయట్లేదు – రష్మీ !

204
- Advertisement -

జబర్దస్త్ తో మనకు బాగా పరిచయమైన రష్మీ ఈ మధ్య సినిమాల్లో కూడా బాగానే రాణిస్తుంది. పెద్ద సినిమాల్లో వేలు పెట్టకుండా, చిన్న తరహా సినిమాలకి, కొత్తగా రంగ ప్రవేశం చేస్తున్న దర్శకులకి ఎక్కువ మద్దతునిస్తుంది రష్మీ. సినిమా ఎలా ఉన్నా రష్మీ కి ఉన్న క్రేజ్ తో ఆ సినిమా తీరాన్ని చేరుకుంటుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు లేదు. ఇంతకుముందు వచ్చిన చారుశీల,అంతం,తను వచ్చెనంట సినిమాలు ఆ కోవకు చెందినవే. ఇప్పుడు విడుదలకు సిధ్ధంగా ఉన్న “అంతకు మించి” సినిమా కథ పరంగా ఎలా ఉన్నప్పటికీ రష్మీ కి ఉన్న క్రేజ్ తో గట్టెక్కేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన రష్మీ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Rashmi Gautham opens up about casting Couch in Tollywood

విలేఖరుల ప్రశ్నలలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావన రాగా ఏ రంగం లో అయినా ఇది సాధారణమే అని, ప్రతి రంగం లోనూ అబ్బాయి, అమ్మాయిల మధ్యలో ఇలాంటివి ఏర్పడటం మామూలేనని, అలాంటి వాటికి ఆ అమ్మాయి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని, ఇండస్ట్రీలో పూర్తిగా కాస్టింగ్ కౌచ్ ని రూపుమాపినా సరే, ఎలాగోలా పైకి రావాలనుకునే అమ్మాయిలు మళ్ళీ ఇలాంటివి మొదలుపెట్టే అవకాశాలున్నాయని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. సుధీర్ అమ్మాయిలతో తిరుగుతున్నాడని విలేఖరి కామెంట్ చేయగా.. “సుధీర్ వయసులో ఉన్నాడు, తప్పేంటి” అని ముక్కుసూటిగా సమాధానమిచ్చింది రష్మీ. సుధీర్ కి, తనకి మధ్య ఉన్న సంబంధం కేవలం ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే తప్ప వేరే ఏం లేదని. మా ఇద్దరికి మా హద్దులు తెలుసు అని ఖరాకండి గా తేల్చి చెప్పేసింది రష్మీ.

- Advertisement -