జీఎస్టీ 2లో రష్మీ..!

478
Rashmi Gautam Ready For G(S)T 2
- Advertisement -

రష్మీ గౌతమ్.. బుల్లితెర ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ‘జబర్దస్త్ కామెడీ షో’లో యాంకర్ గా పనిచేస్తూ ఆడియెన్స్ లో క్రేజ్‌ తెచ్చుకున్న రష్మీ.. వెండితెరపై కూడా తన నటనతో రెచ్చిపోతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించిన రష్మీ, ఆ సినిమాలో అందాల ఆరబోతకు వెనుకాడలేదు. బుల్లితెరపై చూపించే అందాలకు ఫిదా అయిన యూత్‌.. వెండితెరపై అంతకు మించి అందాలను చూడగానే ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

ఈ సినిమాతో ఒక్కసారిగా వెండితెరపై రష్మీకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన జీఎస్టీ సినిమా ఎంత వివాదం అయ్యిందో వేరే చెప్పన్కర్లేదు. దీనికి కొనసాగింపుగా జీఎస్టీ 2 తీస్తానని మాత్రం వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Rashmi-Dating

జీఎస్టీ సెకెండ్ పార్ట్ లో నటించడానికి సై అని ప్రకటించింది. అయితే ఇక్కడ ఒక షరతు విధించింది రష్మీ. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తే తను ఆ సినిమాలో నటిస్తాను అని ప్రకటించింది. మీకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నారా? అని ఓ అభిమాని అడగగా… దానికి ‘అవును.. సమాధానం ఇచ్చిన ఈ జబర్దస్త్ భామ పేరు మాత్రం చెప్పలేదు.

- Advertisement -