దేశం వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించిన పుల్వామ ఉగ్రదాడిని అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇంతటి ఘాతుకంకు పాల్పడ్డ పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు రక్తం మరిగి పోతుంది. 40 మంది వీర జవాన్ లకు దేశ వ్యాప్తంగా ఘన నివాళ్లు సమర్పించారు. ఇదే సమయంలో కొందరు ఉగ్ర దాడిని సమర్ధిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.

ఇండియాలో ఉంటూ ఉగ్ర దాడిని సమర్ధించిన వారిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యాంకర్ రష్మీ కూడా ఉగ్రదాడికి అనుకూలంగా మాట్లాడిన వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.అయితే మాజీ క్రికెటర్ ‘సిద్ధూ’ మాట్లాడుతూ “ఉగ్రవాదానికి దేశంతో గానీ .. మతంతో గాని సంబంధం లేదు” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి.
ఈ విషయంపై యాంకర్ రష్మీ స్పందిస్తూ .. ‘పాకిస్థాన్ కి అనుకూలంగా మాట్లాడుతోన్న సిద్ధూ .. దేశ విభజన సమయంలో అక్కడికే వెళ్లిపోవలసింది. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పటికీ ఇక్కడే ఉండిపోయారు’ అంటూ అసహనాన్ని ప్రదర్శించింది. ఇక ‘పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్’ అంటూ షోయెబ్ హఫీజ్ అనే నెటిజన్ ట్వీట్ కి రష్మీ స్పందిస్తూ ..’సాలే .. ఏంట్రా నీ పాకిస్థాన్ గొప్పతనం? .. మాతోనే నీ అస్తిత్వం .. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి సిగ్గులేదా? మూసుకుని కూర్చో .. లేదంటే పాకిస్థాన్ కి వెళ్లిపో’ అంటూ మండిపడింది.

