హాట్ యాంకర్ రష్మి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి యాంకర్‌గా దూసుకుపోతోంది. ‘జబర్దస్త్’ షోతో అందరిని ఆకట్టుకుంటూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇటు బుల్లితెరపై రాణిస్తూనే అటు సినిమాల్లో వచ్చే అవకాశాలను ఒడిసిపట్టుకుంటోంది. గతంలో రష్మి ‘గుంటూరు టాకీస్’ అనే చిత్రంలో గ్లామర్ పాత్రలో నటించి తన నటన, అభినయంతో కుర్రకారును ఓ రేంజులో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అవకాశాలు వచ్చిన పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు.
‘గుంటూరు టాకీస్’ సినిమా తర్వాత తెలుగులో యంగ్ హీరోల సరసన అవకాశాలు వస్తాయనుకున్నా దరిచేరలేదు. తాజాగా ఈ అమ్మడు ఓ ఈవెంట్‌కు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, డైరెక్టర్ శ్రీనువైట్లతో కలిసి రష్మి హాజరవుతోందంటూ కొందరు నిర్వాహకులు ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన రష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. `నా అనుమతి లేకుండా నా ఫోటో ఎలా వేస్తారని ప్రశ్నించింది. ఈ ఈవెంట్ గురించి నన్నెవరూ సంప్రదించలేదని, ఇలా నా అనుమతి లేకుండా నా ఫోటో వేయడం అనేది సరైంది కాదన్నారు. ఫోటోలు వేసే ముందు సదరు సంస్థల సెలబ్రిటీల అంగీకార పత్రాల గురించి చెక్ చేయాలని నిర్వాహకులపై ఘాటుగా స్పందించింది.
How can they put me up here as a guest when no one even asked me in the very 1st place and this isn’t the 1st time y dont these organisations actually check for the official acceptance letter before putting the pics up can some one find and tag this association pic.twitter.com/DRFwldDyO2
— rashmi gautam (@rashmigautam27) May 20, 2018