బన్నీ రికార్డు బద్దలు కొట్టిన రేష్మి..

325
- Advertisement -

ప్రేక్షకులను ఆకట్టుకుంటే చాలు రికార్డులు వాటంతట అవే బద్దలవుతాయని రష్మీ నిరూపించిందని చెప్పవచ్చు. ఏదైనా సినిమా విడుదల అయ్యాక దానికి సంబందించిన కలెక్షన్లు, ఆడిన రోజులతో పాటు యూట్యూబ్‌లో దానికి సంబంధించిన ట్రైలర్స్, పాటలు క్రాస్ చేసిన వ్యూస్‌ని కూడా తప్పనిసరిగా లెక్కగడుతున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఈ యూట్యూబ్ లెక్కలోకి వెళ్లితే ఇప్పటి దాకా మన టాలీవుడ్‌లో 1 కోటి 96 లక్షల వ్యూస్‌తో అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘రేసు గుర్రం’ చిత్రంలోని ‘సినిమా చూపిస్తా మామ’ అనే పాట రికార్డ్ సృష్టించింది. కానీ హీరోయిన్ మరియు టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ ఆ రికార్డుని బద్దలుకొట్టేసింది.

Race Gurram Movie

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఈ సంవత్సరంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమాలో రష్మీతో చిత్రీకరించిన మాస్ మసాలా సాంగ్ అయిన ‘నీ సొంతం’ అనే పాట మాస్ జనాన్ని ఒక ఊపు ఊపేసింది. దాంతో ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే 2 కోట్ల 3 లక్షల వ్యూస్‌ని సాధించేసి బన్నీని దాటి ముందు వరుసలో నిలబడింది. పైగా బన్నీ పాట రెండేళ్లలో సాదించిన వ్యూస్‌ని రష్మీ పాట కేవలం ఏడాదిలోపే దక్కించుకోవడం మరో విశేషం. ఏది ఏమైనా మరే హీరో క్రాస్ చేయలేని బన్నీ రికార్డ్‌ని రష్మీ తన హాట్ అందాలతో యూత్‌లో హీట్ పుట్టించేసి సరి కొత్త రికార్డ్ నెలకొల్పింది.

Race Gurram Movie

తక్కువ టైంలో రేష్మి సాధించిన ఈ రికార్డును చూసి ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. గుంటూర్ టాకీస్ మూవీ తర్వాత రేష్మి నటించిన మరే చిత్రం ఆ రేంజ్ లో ఆడకపోగా, మరో మంచి హిట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -