ఆఫ్ఘానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 700 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఫిబ్రవరి 16న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ తన పూర్తి నాలుగు ఓవర్ల స్పెల్‌లో 24 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఆ వికెట్‌తోనే అతను టీ20ల్లో 700 వికెట్ల క్లబ్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు.
మ్యాచ్ విషయానికి వస్తే, యూఏఈ తొలి వికెట్‌ను ఆర్యాన్ష్ శర్మ డక్‌గా కోల్పోయింది. కెప్టెన్ మహ్మద్ వసీమ్ 10 పరుగులు జోడించగా, అలీషాన్ షరాఫు 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. రెండో వికెట్ పడ్డ తర్వాత క్రీజులోకి వచ్చిన సోహైబ్ ఖాన్ అద్భుతంగా ఆడి 48 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించాడు. సయ్యద్ హైదర్ 13, హైదర్ అలీ 13 పరుగులు జోడించడంతో యూఏఈ 160 పరుగుల గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది.
ఆఫ్ఘానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ నాలుగు వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీసుకోగా, రషీద్ ఖాన్ ఒక వికెట్‌తో తన చారిత్రాత్మక ఘనతను సాధించాడు.
Also Read:అదృష్టం కొద్దీ కాంగ్రెస్ అధికారంలోకి!

