మహేష్ పై రాశీ ఖన్నా క్రేజీ కామెంట్స్

31
- Advertisement -

ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో మాత్రం వరుస విజయాలు అందుకుంటోంది. వెబ్ సిరీస్‌లలో కూడా అలరిస్తోంది ఈ భామ. తాజాగా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితోపాటు రాశీ ఖన్నా నటించింది. మేఘా వ్యాస్ అనే ఆర్బీఐ ఆఫీసర్‌ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సందర్భంగా రాశీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అలాగే ఇన్‌స్టా లైవ్‌ కూడా ఇస్తోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పై, కామెంట్స్ చేసింది.

రాశీ ఖన్నా ఇన్‌స్టా లైవ్‌లో మహేష్ బాబుతో కలిసి ఎప్పుడు నటిస్తారు అని ఓ అభిమాని అడిగారు. ‘‘మహేష్ సార్‌కి నేను పెద్ద ఫ్యాన్.. మహేష్ బాబు, నమ్రత చాలా మంచి వ్యక్తులు..ఆయనతో కలిసి నటించాలని ఉంది” అంటే తన మనసులో కోరికను బయట పెట్టింది. భవిష్యత్తులో మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం వస్తుందని భావిస్తున్నట్టు రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ఇక
రాశీ ఖన్నా కి మరో లక్కీ ఛాన్స్ వచ్చిందని టాక్.

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో రాశీ ఖన్నా సెకండ్ హీరోయిన్‌గా ఖరారు అయినట్టు సమాచారం. గతవారం ఆమె.. సినిమాకు సంబంధించిన ఫొటో షూట్‌లో పాల్గొన్నారట. ఈ నెల 24న మూవీ షూటింగ్ మొదలు కానుండగా, అదే రోజు హీరోయిన్‌గా జాన్వీ పేరుతో పాటు సెకండ్ హీరోయిన్ గా రాశీ ఖన్నా పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -