‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో రాశి ఖన్నా..

488
- Advertisement -

బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. క్రిష్ తెర‌కెక్కిస్తున్న‌ ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు. యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. చిత్రంలో పాత్ర‌ల‌కి సంబంధించిన క్లారిటీ మెల్ల‌మెల్ల‌గా వ‌స్తుంది.

బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. ప్ర‌స్తుత ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర‌లో రానా నటిస్తున్నాడు. ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టి మంజిమో మోహ‌న్ న‌టిస్తుంది. శ్రీదేవిగా ర‌కుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ న‌టిస్తున్నారు.

Rashi Khanna

ఇక ఎన్టీఆర్‌తో శ్రీదేవితో పాటు ఎక్కువ సినిమాలు చేసిన గ్లామరస్ హీరోయిన్‌గా జయప్రద కనిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో జయప్రద పాత్ర కూడా కనిపిస్తుంది.

ఈ పాత్ర కోసం ఈ తరం గ్లామరస్ హీరోయిన్ల పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు, చివరిగా రాశి ఖన్నాను ఎంపిక చేసినట్టుగా సమాచారం. జయప్రద పాత్రకి రాశి ఖన్నా సరిగ్గా సరిపోతుందని ఈ సినిమా యూనిట్ భావిస్తోందట. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న మూవీ విడుద‌ల‌కి స‌న్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -