మైక్ కట్..రసమయి Vs పద్మారావు

72
rasamai
- Advertisement -

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ – డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ స్వల్ప మాటల యుద్ధం నెలకొంది.

తాను మాట్లాడుతుండగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు మైక్ కట్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు రసమయి. ప్రశ్నలు అడగకుండా స్పీచ్ ఇస్తున్నారని పద్మారావు…రసమయి మైక్ కట్ చేయగా అసలు విషయం చెప్పనివ్వకుండా మైక్ కట్ చేస్తున్నారని అసంతృప్తిని వ్యక్తంచేశారు.

ఇలాగైతే తమకు ప్రశ్నలే ఇవ్వొద్దని…. రెండు ముచ్చట్లు మంత్రిని అడగలేకపోతే ప్రశ్నలేసి ఏమీ లాభమని అడిగారు. అసెంబ్లీలో మంత్రిని ఏమీ అడిగారు, ఏమీ తీసుకొచ్చావని రేపటి రోజు ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పాలన్నారు. అలాంటప్పుడు తమకు క్వశ్చన్స్ ఇవ్వొద్దని.. ఒక్కరికే క్వశ్చన్స్ ఇవ్వండని.. వారికే సమాధానం చెప్పుకోండి అని అన్నారు.తర్వాత మాట్లాడే అవకాశం ఇవ్వడంతో రసమయి చల్లబడ్డారు.

- Advertisement -