ఈ మధ్యకాలంలో తరచూ హీరోయిన్ల పై, వారి సెక్స్ అప్పీల్ పై వస్తున్న కామెంట్లు మరీ మితిమీరిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హీరోలే కాదు కమెడియన్లు, వయసుమల్లిన వారు కూడా భామల ఒంపుసొంపులపై కామెంట్లు చేయటం పరిపాటిగా మారింది. కమెడియన్ అలీ చేసిన కామెంట్లు ఇప్పటికీ అందరికి గుర్తుండే ఉంటాయి. ‘సమంత నడుం బెంజ్ సర్కిల్ లా ఉంది’.. ‘అనుష్క తొడలు అదిరిపోతాయ్’.. అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు అదే రేంజ్లో..కాదు కాదు..అంతకుమించి కామెంట్స్ చేసే ఘనులు కూడా మన టాలీవుడ్లో ఉన్నారు. సినియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, అనేక పౌరాణిక పాత్రలతో పాటు విలన్‌గా తండ్రిగా మెప్పించిన సీనియర్ నటుడు చలపతి రావు చేసిన చెత్త కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
”రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా ఆడియో ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది. నాగార్జున మరియు అమల చీఫ్ గెస్టులుగా వచ్చి అందరినీ అలరించారు. ఈ వేడుకకి నటుడు చలపతిరావు కూడా వచ్చారు. అయితే ఈ సినిమా ట్రైలర్ థీమ్ అంతా ‘అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం’ అనే లైన్ పై రాసిందే. అయితే నిజానికి సినిమా ఆడియో ఫంక్షన్లో ఎవరైనా ఏంమాట్లాడతారు..? ఆ సినిమాలోని పాటల గురించి. అలాగే సినిమా తీస్తున్నప్పుడు వారు పడుతున్న కష్టం గురించి. ఎందుకంటే వాటి గురించి చెప్పుకునే ఛాన్స్ అప్పుడే దొరుకుతుంది కాబట్టి. ఇదే క్రమంలో సినిమా ఆడియో ఫంక్షన్లలో ఎన్నో ప్రశ్నల్ని అడుగుతుంటారు యాంకర్స్. అవి కూడా ఆ సినిమాకి సంబంధించిన ప్రశ్నలే.
అందుకే ఈ సినిమా ఈవెంట్లో అమ్మాయిలు నిజంగా ఆరోగ్యానికి హానికరమా? కాదా? అంటూ వచ్చిన గెస్టులందరినీ అక్కడున్న లేడీ మరియు జెంట్ యాంకర్ ప్రశ్నలు అడిగారు. ఇదే ప్రశ్నను చలపతిరావును అడిగితే.. ఆయన చెప్పిన సమాధానానికి అక్కడున్నవాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు.
ఇంతకీ ఆయన చెప్పిన సమాధానమేంటో తెలుసా? ”అమ్మాయిలు హానికరం కాదుకాని.. పక్కలోకి పనికొస్తారు” అంటూ కామెంట్ చేశాడు. దాంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కనీసం అంతటి చీప్ కామెంట్ చేశామేంటి అనే రిగ్రెట్ కూడా ఆయన ముఖంలో కనిపించలేదని కొందరి అభిప్రాయం. ఇక చలపతి రావు చేసిన ఈ కామెంట్ విన్న లేడీ యాంకర్ షాకుతో ఏం మాట్లాడాలో తెలియక నిర్ఘాంతపోతే.. మరో యాంకర్.. ‘వావ్ సూపర్ సార్’ అన్నాడు.
నిజానికి సీనియర్ హీరో నందమూరి ఎన్టీరామారావు, నాగేశ్వరరావు లాంటి సీనియర్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చలపతి రావు. అంతేకాదు పౌరాణిక సినిమాల్లో చలపతి రావు పోషించిన పాత్రల్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. అంతటి నటనను కనబరిచి, ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించిన ఆయన ఇలా మాట్లాడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఆఫర్లు రావాలంటే..దర్శక నిర్మాతల పక్కలోకి వెళ్ళాల్సిందే అని కొంతమంది హీరోయిన్లు బోల్డ్‌గానే చెప్తున్నసంగతి తెలిసిందే.
దాన్ని మరవక ముందే చలపతిరావు ఇలాంటి కామెంట్ చెయ్యడాన్ని కొంతమంది సినిప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మాలపై ఇలాంటి కామెంట్ చెయ్యడం ఎంతవరకు సమంజసమో ఆయనకే తెలియాలి. ఏదేమైనా ఇంతటి సీనియర్ నటుడు అలాంటి కామెంట్ చెయ్యడాన్ని ఊరికే కొట్టిపారేయకూడదండోయ్.. అలా ‘పక్కలోకి పనికొచ్చే అమ్మాయిలను’ ఆయన ఎంతమందిని చూశారో మరి..! మొత్తానికి రాను రాను ఇలాంటి కామెంట్స్ ఇంకెంత ఘోరంగా మారుతాయో.
https://www.youtube.com/watch?v=HdY4HSqyejA