- Advertisement -
హైడ్రాకు అంత ఓవరాక్షన్, తొందర ఎందుకు అని ప్రశ్నించారు న్యాయవాది రాపోలు భాస్కర్. నియమనిబంధనలు ఎందుకు పాటించడం లేదు.. ఆదివారం కూలకొట్టడం, నోటీసులు ఇవ్వకుండా కూలకొట్టడం కరెక్ట్ కాదు అన్నారు.
కొన్ని కేసుల్లో హై కోర్ట్ స్టే ఇచ్చిన తరవాత కూడా హైడ్రా అధికారులు కూలగొట్టారు.. హైడ్రా అధికారులకు అంత తొందర, ఓవరాక్షన్ ఎందుకు అన్నారు. ఉరి వేసే ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటి అడుగుతారు.. అతని కోరిక తీర్చినాకే ఉరి వేస్తారు అన్నారు.
అతకంటే దారుణంగా ఉంది ఇక్కడ.. చర్యలు తీసుకోవడం తప్పు కాదు కానీ పద్ధతి ఉంటదన్నారు. నోటీసులు ఇవ్వడం, ఎక్సప్లనేషన్ కాల్ ఫర్ చేయటం, ఫైనల్ నోటీసులు ఇవ్వటం దానికి కూడా స్పందించక పోతే కూలగొట్టాలన్నారు. హైడ్రా ఈ ప్రొసీజర్ పాటించక పోవడం వల్లే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు.
Also Read:అలీవ్ గింజలు..అద్భుత ప్రయోజనాలు!
- Advertisement -